సైన్స్ దినోత్సవం సందర్భంగా ఘనంగా మండల స్థాయి పోటీలు

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో  బుధవారం సైన్స్ దినోత్సవ సందర్భాన్ని  పురస్కరించుకొని మండల స్థాయిలో ఉన్నటువంటి 6 నుండి 10 వ తరగతి చదివే విద్యార్థులకు పెయింటింగ్, పోయెట్రీ, సాంగ్స్ ,స్పీచ్ మొదలగు నాలుగు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాములు నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచిన వారు  జిల్లాస్థాయి లో జరిగే పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం మండల నోడల్ అధికారి నాంపల్లి మల్లేశం మాట్లాడుతూ ..నాలుగు అంశాల్లో పోటీలు జరిగాయని, దీనిలో సాంగ్స్ విభాగంలో డి .శ్వేత,స్పీచ్ విభాగంలో పి.అక్షర జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికలు సెలెక్ట్ అయ్యారని  తెలిపారు. అదేవిధంగా పెయింటింగ్ లో నవీన్ జి.ప.ఉ.ప బాలురు మద్నూర్, పోయెట్రీ లో కే.గాయత్రి జి.ప.ఉ.ప మేనూర్ జిల్లాస్థాయిలో జరిగే పోటీలు అనగా 10-02-2024 శనివారం జిల్లా సైన్స్ కేంద్రం లో ఉదయం 10 గంటల నుండి నిర్వహించే పోటీలలో  పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ క్యాధారి రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల  సృజననాత్మకథను పెంపొందించడానికి ఇలాంటి కర్యక్రమాలు దోహద పడుతాయన్నారు. ఈ కార్యక్రమానికి  న్యాయ నిర్ణయితలుగా పల్లె వారు మారుతి, బుజ్జయ్య, బాలు,సురేష్,మంజీరా,సవిత, స్రవంతి,హన్మంతు,శివాజీ,విజయ్ వ్యవహరించారు.