
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు.మాథ్స్ టాలెంట్టెస్ట్ లో మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు మీడియంలో కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అప్సర్ ప్రథమ బహుమతి, గాయత్రి ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఇంగ్లీష్ మీడియంలో కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎండి ఫైజన్, చౌట్జి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్. తేజస్విని గెలుచుకున్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గణితఫోరం అధ్యక్షుడు కృష్ణకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.