మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం..

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గురువారం  మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల క్రీడలను మండల విద్యాశాఖ అధికారిని టి రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలందరూ చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయమని దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఈ మండలంలో ప్రాథమిక స్థాయి విద్యార్థి విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి పిల్లల్ని ఉత్సావంతులు చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు ఆటల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు ఈ ఆటలను స్ఫూర్తి గా తీసుకొని ఇంకా బాగా ఆడాలని సూచించారు .ఆటల ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందింపజేయాలని మండలంలోని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.