మండల స్థాయిలో పసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు పసర ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలోని ఆసక్తి కలిగిన యువత అందరూ ఈ పోటీలలో పాల్గొనాలని, గెలిచిన యువతకు బహుమతితో పాటు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనే వారు తమ టీమ్ సభ్యులతో కలిసి పసర పోలీస్ స్టేషన్ నందు ఆగస్టు 3 వ తేదీ నుండి 6 వ తేదీ మధ్యలో నమోదు చేసుకోగలరు. మరిన్నివివరాల కొరకు సంప్రదించవలిసిన నంబర్లు 1. 8712530189 2. 8712530410 వీరిని సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు. జాతీయ రహదారిపై కూలిన చెట్టును క్లియర్ చేసిన పోలీసులుగురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పసర చెక్ పోస్టు వద్ద జాతీయ రహదారి పై చెట్లు విరిగి పడటం తో ఆ మార్గం లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మార్గం లో ప్రయాణించే వాహనదారులు డయల్ 100 ద్వారా పసర ఎస్ ఐ ఏ కమలాకర్ కి విషయం చెప్పగా ఆ రాత్రి వెంటనే స్పందించిన ఎస్ ఐ స్వయంగా చెట్లు విరిగి పడిన ప్రాంతానికి వెళ్లి చెట్లను వెంటనే జెసిబి సహాయంతో తొలిగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. అర్థరాత్రి డయల్ 100 కు స్పందించి సమస్యను పరిష్కరించిన ఎస్ ఐ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.