నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కావొద్దు అనే కార్యక్రమ ప్రచారం లో భాగంగా తేదీ 17.08.2024 రోజున మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో మీడియాతో ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ యువత తెలిసి తెలియక మత్తు పదార్థాలకు బానిస అయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని అందుకే వాళ్ళను చైతన్య పరచటంలో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని క్రీడాకారులు అందరూ తమ క్రీడా నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించవచ్చని , క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కల్పించనునట్లు తెలిపారు. టోర్నమెంట్ జరుగు స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోవిందరావు పేట తేదీ : 17.08.2024సమయం: ఉదయం 0900 గంటలకు