ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో బాలరాజు తహసీల్ధార్ కోడి చింతల రాజు మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపెళ్లి మధ్యలో ఉన్న రోడ్డం, మేచరాజు పల్లి వద్ద ఉన్న రోడ్డు వద్ద ప్రజలకు తగు సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజు కురుస్తున్న వర్షాలకు అకస్మాత్తుగా ఒకేసారి వర్షపు నీరు తడ రూపంలో వచ్చి వాగులు వంకలు బొర్లీ పోయే ఆకాశం ఉందని అన్నారు. ఆ సమయంలో రోడం ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లే పాదాచారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకోసం వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్ళవద్దని తెలిపారు. వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం సాగు చేసుకునే రైతులు పాటించవలసిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పంట చేనులో వర్షపు నిరు నిల్వ ఉన్నట్లయితే వాటిని అంట చేనులో నీరు నిల్వ లేకుండా బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలని అన్నారు. నిల్వ ఉన్నట్లయితే పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏదైనా వేశారంగ సమస్యలు ఉన్నట్లయితే ఆయా గ్రామాల సంబంధించిన ఏఈవోలు రైతు వేదికలు అందుబాటులోనే ఉంటున్నారని, వారికి వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. విద్యుత్తు ఏఈ సింధు సబ్ ఇంజనీర్ హరీష్ మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు విద్యుత్తు కనెక్షన్ ఉన్నచోట, విద్యుత్తు స్తంభాల వద్ద ఎవరు ఉండవద్దని అన్నారు. ప్రమాదవశాత్తు వర్షపు నీరుతో షాక్ తగిలే అవకాశం ఉందని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, గణేష్ కరోబార్ రవి, రెవిన్యూ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.