మద్నూర్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో గురువారం నాడు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర వేడుకలు పురస్కరించుకొని కార్యాలయం ఎదుట మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ వేడుకలకు మండల శాఖ గ్రామాల శాఖల పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.