మండల పరిధిలోని నెమ్మికల్ లో శ్రీ శ్రీ దండు మైసమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ మహోత్సవం జరిగి మండల కాలం అనగా (41 రోజులు) అయినందున బుధవారం మండల పూజ కార్యక్రమం నిర్వహించచారు . గ్రామానికి చెందిన దంపతులు భక్తులు ఈ పూజ కార్యక్రమం లో ప్రత్యేక యజ్ఞ యాగాదులు చేశారు. ఈ కార్యక్రమం లో ఈఓ కుషలయ్య, ఎంపిటిసి ముత్తయ్య,కేశవ రెడ్డి, కాస శ్రీనివాస్, నగేష్ సైదులు,సతీష్ కిరణ్, శ్రీనివాస్, రమేష్ తదతరులు పాల్గొన్నారు.