ప్రమాదవశాత్తు మండల వాసి మృతి..

నవతెలంగాణ – పెద్దవంగర
ప్రమాదవశాత్తు మండల వాసి మృతి చెందిన ఘటన తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని సోమ్ల తండాకు చెందిన జాటోత్ యాకన్న కు భార్య రజిత, ఇద్దరు కుమారులు వినీత్, నవనీత్ సంతానం. ఈ నెల 28 న తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామ శివారు పటేల్ గూడెంలో తన జేసీబీ తో సోదరుడు జాటోత్ కృష్ణ (డ్రైవర్) తో కలిసి తాటిచెట్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టు యాకన్న మీద పడబోతుండగా తప్పించబోయి అతనికి జేసీబీ బకెట్ బలంగా తాకింది. వెంటనే యాకన్న ను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.