డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ దీపక్ రాథోడ్ (అర్ కె లక్ష్మీ చిల్డ్రన్ హాస్పిటల్ నిజామాబాద్) ఎంబిబిఎస్ ఉస్మానియా, ఎండి పిడియాట్రిక్స్,జిప్ మర్ (గోల్డ్ మెడలిస్ట్) వాసికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయిలో నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం కాస్ట్ సబ్యులుగా నియమితులైనట్లు మంగళవారం నవతెలంగాణ కు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ప్రతి తమ ఐదేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి వైద్యుడు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో తమ రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించుకోవల్సి ఉంటుందని, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కు 30క్రెడిట్ అవర్స్, దీనిని జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాన్ఫరెన్స్, సిఎంఈ ద్వారా పొందవచ్చని సూచించారు. డాక్టర్ దీపక్ రాథోడ్ కాన్ఫరెన్స్, సిఎంఈ కోసం క్రెడిట్ అవర్స్ మంజూరు చేసే అదికార సబ్యుల్లో ఒకరు. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవం దక్కినందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు.రాబోవు రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సంపాదించి పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్పూర్తిగా కోరారు.