
ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో ప్లాంటేషన్ కార్యక్రమం ,అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై సమీక్షించనైనది. ఈ సమీక్ష సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డి రాజేందర్ మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడైతే మొక్కలు లేని ప్లేసు గుర్తించి మొక్కలు నాటుటకు అలాగే గతంలో మొక్కలు నాటిన ప్లేస్లలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిలో ప్లాంటేషన్ చేయుటకు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను సంబంధిత వివో మరియు హెడ్మాస్టర్ల సహకారంతో త్వరితగతైన పూర్తి చేయుటకు తగు ఆదేశాలు సూచనలు జేశారు. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను కుమార్, ఎంపీ ఓ , విమల మండల సహాయక ఇంజనీర్ యుగంధర్ ఏపీవో రాజిరెడ్డి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.