పాఠశాలలకు లైబ్రరీ పుస్తకాలు అందజేసిన: మండల విద్యాధికారి యోసేఫ్

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని వివిధ పాఠశాలలకు సోమవారం లైబ్రరీ పుస్తకాలను మండల విద్యాధికారి యోసేఫ్ ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ తో పాటు, వివిధ అంశాలపై అవగాహన రావడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో సి ఆర్ పి లు మహమ్మద్, సురేఖ, యుగేందర్, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.