మహిళా దినోత్సవ సంక్షేమ సభకు తరలిన మండల మహిళలు

– మహిళా దినోత్సవ సంక్షేమ సభకు తరలిన అంగన్వాడీలు ఆశ వర్కర్లు ఐకేపీ సంఘాల మహిళలు
నవతెలంగాణ- మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు జుక్కల్ నియోజకవర్గం స్థాయి మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నియోజకవర్గంలోని పెద్ద కోడప్గల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి మద్నూర్ మండలం నుండి అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఐకెపి మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాలనుసారంగా మహిళ సంక్షేమ దినోత్సవం కి మండలం నుండి వివిధ శాఖల్లో పని చేసే మహిళలు అధికారులు పెద్ద కొడప్పుగల్ మండల కేంద్రానికి తరలి వెళ్లారు.