మండల యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని జయప్రదం చేయాలి

నవ తెలంగాణ-గోవిందరావుపేట:
 మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన మండల యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతాక్రాతి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చింతాక్రాతి మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్ లు మాట్లాడారు. ఆదివారం మండల కేంద్రంలోని కాకతీయ కమ్మ సేవ సంఘం నందు గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్  విచ్చేయుచున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో యువత భవిష్యత్తు అంధకార బంధురమైందని యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. యువత భవిష్యత్తు లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశానికి  మండలంలోని జిల్లా నాయకులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ గ్రామాల అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు, సీతక్క అభిమానులు మరియు మండలంలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.