మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఉన్న ఋషికొండ అయ్యప్ప క్షేత్రంలో శుక్రవారం మండల పూజా ఘనంగానిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలను హిందూ ధర్మం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులకు మంత్రోచ్ఛారణల మధ్య మండల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామికి విశేషంగా అభిషేకం, రాజ్యా శ్యామల యాగం కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భక్తులు అధిక పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప క్షేత్రంపై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.