నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
వే బ్రిడ్జి నిర్వాహకులు తప్పనిసరిగా వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పీ. రామకష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 వే బ్రిడ్జిలను తనిఖీలు చేశామని, ఎక్కడ ఉల్లంఘన జరగలేదని తెలిపారు. వే బ్రిడ్జ్ నిర్వాహకులు వారి వద్ద ఉన్న టెస్ట్ వెయిట్లతో వే బ్రిడ్జ్ సరిగ్గా ఉందా లేదా అనేది సరిచూసుకోవాలన్నారు. సరిగా లేనిపక్షంలో లీగల్ మెట్రాలజీ శాఖ అనుమతి తీసుకొని టెక్నిషన్లచే సరి చేయించుకోవాలని సూచించారు. వినియోగదారులకు అనుమానం వచ్చినట్లయితే వే బ్రిడ్జ్ వారి వద్ద ఉన్న బాట్లతో సరిగా ఉందా లేదా అనే విషయాన్ని చూపించాలని సూచించారు. ప్రస్తుతం జరిగే తనిఖీలలో ఎటువంటి ఉల్లంఘనలు బయటపడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.