ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం కాచారం, గౌరాయపల్లి సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభలు దుంపల మధుసూదన్ రెడ్డి, పసునూరి అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ నరసింహులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, దుంపల రామిరెడ్డి, వంటేరు పెంటా రెడ్డి, నాలపట్ల శంకర్, దుంపల రజిత, ఇంజలింగం, బబ్బురి శ్రీనివాస్, వడ్లకొండ బిక్షపతి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.