కాంగ్రెస్ అధ్యక్షునిగా మంగ ప్రవీణ్ ఘన విజయం..

Manga Praveen's great success as Congress president..– భువనగిరి ఎమ్మెల్యేని కలిసిన ప్రవీణ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుబంధ విభాగం యువజన కాంగ్రెస్ కు జరిగిన ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా భువనగిరి మండలం చీమల కొండూరు గ్రామానికి చెందిన మంగ ప్రవీణ్ ఘన విజయం సాధించారు. ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 14 వరకు యువజన కాంగ్రెస్ సంబంధించిన ఐ వై సి ఆప్ ద్వారా జరిగిన ఆన్లైన్ ఓటింగ్ లో 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు లోపు ఉన్న యువతి యువకులను అర్హులుగా చేస్తూ వారిని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షింపజేసి కఠినమైన నియమ నిబంధనలతో అఖిలభారత యువజన కాంగ్రెస్ న్యూఢిల్లీ వారు నిర్వహించిన ఈ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను (భువనగిరి మరియు ఆలేరు ను) ఒక జిల్లా యూనిట్ గా చేస్తూ ఎన్నికలు నిర్వహించగా,
 ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న మంగ ప్రవీణ్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి సంఘ నాయకునిగా గత బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలపై అనేక కేసులను తట్టుకొని చేసిన పోరాటాల ఫలితంగా జిల్లాలో పార్టీ శ్రేణుల్లో తనకున్న పేరు పనితనం చూసి అందరూ నాయకులు కార్యకర్తలు తన నియామకానికి సహకరించారని, నా నియామకానికి సహకరించిన భువనగిరి శాసనసభ్యులు  కుంభం  అనిల్ కుమార్ రెడ్డి కి, ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కి, ఎం ఎల్ సి  బల్మూర్ వెంకట్ కి,  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి, డిసిసి అధ్యక్షులు  అండెం సంజీవరెడ్డి కి  విజయం కోసం కష్టపడ్డ యువజన కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.