తీవ్రస్థాయి స్వరపేటిక (వాయిస్ బాక్స్) క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు కొత్త ఆశను అందిస్తోంది
నవతెలంగాణ మంగళగిరి: పునరావృత స్వరపేటిక క్యాన్సర్ (వాయిస్ బాక్స్ క్యాన్సర్)తో బాధపడుతున్న 47 ఏళ్ల వ్యక్తి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరిలో విజయవంతంగా చికిత్స పొందారు. క్యాన్సర్ చికిత్సలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ ఏఓఐ లో డాక్టర్ ఇషాంత్ అయినపూరి మరియు అతని బృందం ఈ శస్త్రచికిత్సను అత్యంత నైపుణ్యంతో విజయవంతంగా నిర్వహించింది. ఈ రోగి అనేక ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కు వచ్చారు. అధిక కార్డియాక్ రిస్క్ కలిగి ఉండటంతో పాటుగా మెడపై పెద్ద పరిమాణంలో ఫైబ్రోసిస్ సైతం వుంది.
ఇది గతంలో తొమ్మిది నెలల రేడియేషన్ థెరపీ చేయటం వల్ల వచ్చిన పరిణామం. అతను సంక్లిష్టమైన సాల్వేజ్ టోటల్ లారింజెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్సలో వాయిస్ బాక్స్‌ను తొలగించడంతోపాటు, మెడకు రెండు వైపుల నుండి శోషరస కణుపులు మరియు చుట్టుపక్కల కణజాలాన్ని చికిత్సలో భాగంగా తీసివేయటం జరిగింది.
ఈ రోగి, సాంబశివరావు, తొమ్మిది నెలల ముందు కీమో రేడియోథెరపీ పూర్తి కోర్సు చేయించుకున్నారు. పునరావృత మరియు అత్యంత సంక్లిష్టమైన పరిస్థితితో రావటం తో , వైద్య బృందం ఈ సాల్వేజ్ శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ శస్త్రచికిత్సలో గొంతు ముందు భాగాన్ని కవర్ చేయడానికి ఛాతీ నుండి కండరాలు మరియు చర్మాన్ని ఉపయోగించడం జరిగింది. దీనితో పాటుగా శ్వాస తీసుకోవడం కోసం మెడలో శాశ్వత ఓపెనింగ్ ను సృష్టించారు. శస్త్రచికిత్స అనంతరం రికవరీ సాఫీగా ఉంది. శస్త్రచికిత్స చేసిన 40 రోజుల తర్వాత, రోగి యొక్క గాయం పూర్తిగా నయమైంది. స్పీచ్ ఫంక్షన్‌ను పునరుద్ధరించడంలో సహాయపడటానికి ఆరు నెలల్లో వాయిస్ ప్రొస్థెసిస్ ప్రక్రియ ప్రణాళిక చేయబడింది.
సీటీఎస్ఐ-దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది ఈ మైలురాయిపై మాట్లాడుతూ , “అత్యంత సవాలుగా ఉన్న కేసులలో కూడా ప్రపంచ-స్థాయి, మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ కేర్‌ను అందించడంలో ఏఓఐ యొక్క నిబద్ధతను ఈ కేసు ఉదహరిస్తుంది. మా రోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపడానికి వ్యక్తిగతీకరించిన, అధునాతన చికిత్సలను అందించడంలో మా బృందం యొక్క అంకితభావం కొనసాగుతుంది. ఆంకాలజీ చికిత్సలో కొత్త ప్రమాణాలను నిర్దేశించటంలో వారి ప్రయత్నాలకు నేను గర్వపడుతున్నాను” అని అన్నారు.
ఏఓఐ మంగళగిరి ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ , “ఈ విజయవంతమైన శస్త్రచికిత్స ఏఓఐ మంగళగిరి యొక్క అత్యాధునిక సామర్థ్యాలకు నిదర్శనం. మా సర్జికల్, ఆంకాలజీ మరియు క్రిటికల్ కేర్ టీమ్‌ల మధ్య సౌకర్యవంతమైన భాగస్వామ్యం ఈ కేసులో ఉన్న సంక్లిష్టమైన వైద్య మరియు శస్త్రచికిత్స సవాళ్లను అధిగమించడానికి మాకు సహాయపడింది. మా రోగులందరికీ కారుణ్య సంరక్షణ మరియు క్లినికల్ ఎక్సలెన్స్ అందించాలనే మా మిషన్‌ను మేము కొనసాగించటానికి కృషి చేస్తున్నాము” అని అన్నారు.
సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి ఈ ప్రక్రియ యొక్క సంక్లిష్టతలపై మాట్లాడుతూ , “ఇది అధిక-ప్రమాదకరమైన కేసు, ఇది కణితి యొక్క పునరావృత పరంగా మాత్రమే కాకుండా రోగి యొక్క గుండె పనితీరు సరిగా లేకపోవటం మరియు విస్తృతమైన మెడ ఫైబ్రోసిస్ కారణంగా కూడా సంక్లిష్టమైన కేసు. అయితే , ఖచ్చితమైన ప్రణాళిక మరియు టీం వర్క్ ద్వారా, మేము విజయవంతమైన ఫలితాన్ని చూడగలిగాము. అతను కోలుకోవడం గురించి ఆశాజనకంగా ఉన్నాము. అతని జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆరు నెలల్లో వాయిస్ ప్రొస్థెసిస్‌ను అమర్చడానికి ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. సంక్లిష్టమైన క్యాన్సర్ కేసులను సమగ్ర విధానంతో నిర్వహించడంలో ఏఓఐ మంగళగిరి యొక్క నైపుణ్యాన్ని ఈ విజయగాథ హైలైట్ చేస్తుంది, రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది.