నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని పలు గ్రామాలలో మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు పూత, ఖాతా లేక నిండా మామిడి తోటలు ముంచినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్, చింతోని చిలక, గంగారం, సిద్ధారం, బోడు తదితర గ్రామాలలో మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. అతి, అనావృష్టి వర్షాల కారణంగా మామిడి తోటల్లో పూత లేదని వాపోతున్నారు. డిసెంబర్ నెల నుండి పూత కోసం, పిందెరాలకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి మందు పిచికారి చేశామని, ఫలితం మాత్రం లేదంటున్నారు. మార్చి నెల చివరికల్లా పూత మొత్తం పిందెగా మారాలని, ఏప్రిల్ నెల వచ్చిన చెట్టుకు పూతే లేదని అంటున్నారు. మండలంలో సుమారు వందఎకరాలలో మామిడి తోటలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాదని, ఆశించినదిగుబడిరాదని, సాగుచేస్తున్న రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం కాయ రేటు కూడా ఎక్కువ ధర ఉంటుందంటున్నారు. ఒకవేళ అరకురా ఖాతా వచ్చిన ఏప్రిల్ నెలలో వచ్చే గాలి దుమ్ములకు పూర్తిగా రాలిపోతాయంటున్నారు. ఏది ఏమైనా మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టమని వాపోతున్నారు.