కృత్రిమంగా మామిడిని మాగబెడుతున్నారు

కృత్రిమంగా మామిడిని మాగబెడుతున్నారునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలకు, నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌ కొత్తపేట పండ్ల మార్కెట్లో కొంత మంది అమ్మకందార్లు పండ్లను మాగ పెడుతున్నట్టు టాస్క్‌ ఫోర్స్‌ బృందం గుర్తించింది. నిషేధిత పద్ధతిలో మాగ పెడుతున్న 550 కిలోల పండ్ల నిల్వలను వారు సీజ్‌ చేశారు. అమ్మకందార్లు ఖచ్చితంగా నిబంధనలు పాటించా లనీ, లేదంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నట్టు అనుమానం వస్తే 91001 05795కు వాట్సప్‌ మెసేజ్‌ చేయాలని ప్రజలకు సూచించారు.