గుండాల ప్రాంతంలో పోలీసులు బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం పసర పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఏ కమలాకర్ సిబ్బందితో కలిసి దోన గుత్తిపోయే గూడెం ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ గుత్తి కోయగూడెం ప్రజలతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుడదని ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు.చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతే కాకుండా అ్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.