న్యూఢిల్లీ : ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్స్ టోర్నీలో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్ర పోరాటానికి క్వార్టర్ ఫైన్లలోనే ముగిసింది. వరల్డ్ నం.30 ప్యాడ్లర్ మనిక బత్ర 25 నిమిషాల్లోనే సెమీ ఫైనల్ బెర్త్ చేజార్చుకుంది. చైనా అమ్మాయి టినాయి 11-8, 11-8, 12-10తో మనికపై పైచేయి సాధించింది. మనిక బత్ర మూడు గేముల్లోనూ గట్టిగా పోరాడినా.. చైనా అమ్మాయిదే పైచేయిగా నిలిచింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసిన సంగతి తెలిసిందే.