మణికొండ అభివృద్ధి నమూనా రాజేంద్రనగర్‌లో చేసి చూపిస్తా

– కాంగ్రెస్‌ అభ్యర్థి కస్తూరి నరేందర్‌ ముదిరాజ్‌
– శంషాబాద్‌ మండలంలో వేలాది మందితో విస్తత ప్రచారం
నవతెలంగాణ-శంషాబాద్‌
ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే మణి కొండ మునిసిపాలిటీ అభివృద్ధి నమూనా రాజేంద్ర నగర్‌ నియోజకవర్గంలో చేసి చూపిస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి కస్తూరి నరేందర్‌ ముదిరాజ్‌ అన్నారు. సోమ వారం మండల పరిధిలోని పెద్ద తూప్ర, పెద్ద తూప్ర తండా, ముచ్చింతల్‌ మదనపల్లి పాత తండా, కొత్త తండా, గచ్చుబాయి తండా, మదనపల్లి, పాలమా కు ల, పిల్లోని గూడ, జూకల్‌, పెద్దషాపూర్‌ గ్రామాలలో ఆయన విస్తత ప్రచారం నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తల మధ్య కస్తూరి నరేందర్‌ ముదిరాజ్‌ రోడ్‌ షో ప్రచారం విజయవంతంగా సాగింది. కాం గ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజ లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు గడ్డం శేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు దోపిడీ చివరకు స్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాలకు పాల్పడు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఉండి ప్రజల ఆశీర్వా దంతో మణికొండ మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నానని తెలిపారు. తాను చేసిన అభివద్ధిని చూసి రాష్ట్ర ప్ర భుత్వం మణికొండ మున్సిపాలిటీ ఉత్తమ మున్సి పాలిటీగా ఎంపిక చేసి 4 అవార్డులు ఇచ్చిందని తెలి పారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు దంచుడు బుక్కు డు తప్ప ప్రజల ప్రయోజనం పట్టడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఒక్క పాలమాకుల గ్రామంలో అనేక సమస్యలు తన దష్టిలోకి వచ్చాయని ఇలాంటి సమ స్యలే శంషాబాద్‌ మండలంలో మున్సిపాలిటీలో అనేకం ఉన్నాయన్నారు. పాలమాకుల గ్రామంలో స్మ శాన వాటిక, ముచింతల్‌ సమస్య రోడ్డు, డ్రయినేజీ సమస్యతో పాటు అనేక సమస్యలు పరిష్కరిస్తాన న్నా రు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇం డ్లు రాజీవ్‌ గహకల్ప ఇల్లు తప్ప బీఆర్‌ఎస్‌ పాలన లో ఒక్కటీ కూడా రాలేవన్నారు. రాష్ట్రంలోని అం తర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాజేంద్రనగర్‌ ని యోజకవర్గం అభివద్ధిలో మాత్రం పాలకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర వెనుకబాటుకు గురైంద న్నారు. శం షాబాద్‌ రూపురేఖలు మారుస్తానని ప్రజలు కాంగ్రెస్‌ కు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
ఇంకా మోసపోవద్దు: చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌
బీఆర్‌ఎస్‌ పాలనలో ఉచిత వాగ్దానాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌ హ యాంలో శంషాబాద్‌ మండలంలో పదేళ్ల క్రితం పేద లకు ఇండ్లు ఇండ్లు కట్టుకున్న వారికి డబ్బులు వచ్చా యన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ లతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మండల ఉపాధ్యక్షులు కోటేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ పాలమకుల గ్రామంలో సమస్యలు పేరుకుపోయాయన్నారు. ఎమ్మెల్యేగా కస్తూరి నరేందర్‌ను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్‌ యాదవ్‌, టీపీసీసీఎస్‌సీ సెల్‌ ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్‌ పట్టణ అధ్యక్షులు సంజరు యాదవ్‌, ఉపాధ్యక్షులు కోటేష్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి చిలకమర్రి మహేం దర్‌ ముదిరాజ్‌, ఎన్‌ఎస్‌ యుఐ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఆనంద్‌, సర్పంచులు కమోనిబాయి లక్ష్మయ్య, చెక్కల చంద్రశేఖర్‌ ముదిరాజ్‌, హస్లీ రాములు, ఎంపీటీసీలు వై సంగీత సిద్దేశ్వర్‌, తొంట గౌతమి అశోక్‌, మైలారం సులోచన, జగన్మోహన్‌, అక్రమ్‌ ఖాన్‌, ఉప సర్పంచ్‌ సురేష్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.