నవతెలంగాణ-గండిపేట్
పార్లమెంట్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావును గండిపేట్ బీజేపీ నాయకులు కలిసి సన్మానం చేశారు. బుధవారం నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మణికొండ నార్సింగి మున్సిపాలిటీలకు చెందిన ఆ పార్టీ నాయకులు ఎంపీ అభ్యర్థులను వేరు వేరుగా కలిసి సన్మానించారు. బీజేపీ తరఫున భారీ మెజారిటీతో గెలిచిన డీకే అరుణ, రఘునందన్‌రావుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి అంజన్ కుమార్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బీరప్ప, కో ఆప్షన్ సభ్యులు సిద్ధప్ప, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, నర్సింగ్ రావు, కౌన్సిలర్లు వందన, లక్ష్మి, శ్వేత, మహిళలు సుజాత సంగీత, నాయకులు శివకుమార్ శివరాంరెడ్డి రాంబాబు రంగబాబు, నార్సింగ్ మున్సిపాలిటీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్, నగేష్ అనిల్ ,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.