ముఖ్యమంత్రి సహాయనిధికి మణిపాల్ హాస్పిటల్ రూ. 25 లక్షల విరాళం

Manipal Hospital Rs. 25 lakh donationవిజయవాడ: వరద బాధితులకు అండగా నిలిచేందుకు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని వరదలను విజయవాడ ప్రజలు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. మా వంతు సాయంగా వరద బాధితులకు రూ.25 లక్షలు అందజేశాము. గతంలో కూడా ప్రజలకు కష్ట సమయంలో మణిపాల్ హాస్పిటల్ అండగా నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాముః అని అన్నారు.