నీటి సౌకర్యానికి 40 వేల ఆర్థిక సహాయం అందించిన మంజుల రెడ్డి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో నీటి సౌకర్యం కోసం శుక్రవారం సర్పంచ్ తోడేటి రమేష్ కు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి రూ. 40వేల రూపాయల చెక్కును అందజేశారు. సహాయం అడిగిన వెంటనే స్పందించి, సహకారం అందించిన మంజులరెడ్డి కి గౌడ కులస్తులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్, గౌడ సంఘము అధ్యక్షులు, వార్డు మెంబర్ బొమ్మగాని ఏల్లయ్య, బొమ్మగాని అంజయ్య, బొమ్మగాని రవి, సతీష్, రాజిరెడ్డి, మధుకర్, శ్రీధర్, నారాయణ, సురేష్ తదితరులున్నారు.