కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన మంజులరెడ్డి

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు  గంగాడి కృష్ణ రెడ్డిని శనివారం కరీంనగర్ లోని నివాసంలో బిజెపి , హుస్నాబాద్ నియోజకవర్గం సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బీజేపీ పార్టీలో చేరిన మంజుల రెడ్డి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో  బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, మంజులక్క యువసేన సభ్యులు పాల్గొన్నారు.