నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని పెద్ద గుండవెల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ తల్లిని మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే సతీమణి కొత్త మంజులత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో దుబ్బాక నియోజకవ ప్రజలు సంతోషంగా ఉండాలని, ఎమ్మెల్యే ఎన్నికల్లో అమ్మవారికి మొక్కుకున్న మొక్కులను చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీమణి కి బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి, ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చిన్ని సంజీవరెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులున్నారు.