నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవాలు ఈనెల 23 , 24 తేదీలలో జరగనున్నాయి. గురువారం నాడు ఉదయం రథోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతానికి మాన్కార్ పటేల్ నాగనాథ్ హనుమాన్లు కృష్ణ పటేల్ వారి కుటుంబ సభ్యులతో భాజా భజంత్రీలతో ఇంటి నుండి తీసుకువచ్చి రతానికి శిఖరాన్ని ఎక్కించారు. వెంకట్ మహారాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి వ్రతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వ్రతాన్ని గురువారం రాత్రి మండల కేంద్రంలో ఊరేగిస్తారు లక్ష్మీనారాయణ ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమై మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో గల ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రదక్షిణ వేయించుకొని మళ్లీ ఊరేగింపుగా లక్ష్మీనారాయణ ఆలయానికి తీసుకు వస్తారు. శిఖరాన్ని ఎక్కించిన సందర్భంగా మాన్కార్ పటేల్ కుటుంబక్షలు స్వీట్లను భక్తులకు పంచిపెట్టారు.