
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణలను పరుగులు పెట్టించి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన రాజనీతిజ్ఞుడని ఆయన సేవలు దేశానికి ఆదర్శం అని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అన్నారు. భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా, అంతకు ముందు ఆర్థికమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్‌ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా కుడా చెబుతారని అన్నారు. ఆయన మృతి దేశానికి, యావత్ ప్రపంచానికి తీరని లోటని నివాళులు అర్పించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని, ఆయన సంస్కరణలు దేశానికే ఆదర్శం అని కొనియాడారు.