బాలం రాయిలో మన్నె క్రిశాంక్‌ బస్తీ నిద్ర కార్యక్రమం

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ బోర్డ్‌ మూడో వార్డులోని బాలం రాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మన్నె క్రిశాంక్‌ కంటోన్మెంట్‌ వార్డు మాజీ సభ్యుడు ప్రభాకర్‌తో కలిసి కలిసి 9వ బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా స్థానికులు.. ఇండ్ల స్థలాలకు పట్టాలు, వద్ధ ఒంటరి మహిళలకు పెన్షన్‌ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా క్రిశాంక్‌ మాట్లాడుతూ అధికారులు దష్టికి తీసుకుపోయి సత్వరమే సమస్యలు పరిష్కారం కషి చేస్తానని చెప్పారు అనంతరం ఆయన స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సూరజ్‌, త్రివేద్‌, నవీన్‌, వెంకట్‌, బుచ్చి, మోని, రఘు, ఉదరు, శివారెడ్డి, నాని, సాయి, రాజు, ఫహీమ్‌, యూనస్‌ తదితరులు పాల్గొన్నారు.