నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అక్రమ మద్యానికి కాంగ్రెస్ సర్కారు తలుపులు తెరిచిందని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త మద్యానికి రాష్ట్రంలో అవకాశం లేదంటూ ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిందంతా అబద్ధమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.