నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులతో చర్చించి నాగర్ కర్నూల్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.