– రైతు పొలాలకు సాగునీరు అందించాలి
– జిల్లా కలెక్టర్ ను కలిసిన మంథని మండల అధ్యక్షులు ఐలి.ప్రసాద్
నవతెలంగాణ – మంథని
శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు కాలువల ద్వారా సత్వరమే నీటిని అందించాలని కోరుతూ గురువారం పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ చివరి భూముల వరకు సాగు నీటిని అందించే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు.స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో ఆయకట్టు చివరి భూములకు కాలువల ద్వార నీరు అందించే విధంగా చర్యలు తీసుకుoటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా పెద్దపెల్లి జిల్లా కోఆర్డినేటర్ అరెల్లి కిరణ్ గౌడ్, పలువురు నాయకులు ఉన్నారు.