మంథని, రామగి ఓటర్లే కీలకం..

– ఇక్కడ 84,606  మంది ఓటర్లు 
– బరిలో 21మందిఅభ్యర్థులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసేది మంథని,రామగిరి మండలాల ఓటర్లే.గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలను పరిశీలిస్తే మంథని,రామగిరి మండలాల ఓటర్లు ఏపార్టీకి మొగ్గుచూపితే ఆపార్టీ అభ్యర్థి విజయ కేతనం ఎగురవేసిన దాఖలాలు ఉన్నాయి.మంథని నియోజకవర్గంలో కార్మిక,కర్షక కలగలిపి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని,రామగిరి మండలాల్లోని ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి.దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు మంథని,రామగిరి పైనే ఆశలు పెట్టుకున్నారు.మంథని నియోజకవర్గంలో ప్రస్తుతం 21మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఇందులో ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్,కాంగ్రెస్,బిజెపి,బిఎస్పీతోపాటు పలువురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.ఎన్నికలు మరో తొమ్మిది రోజులుండగా అభ్యర్థులంతా ఓటర్లను ప్రచ్ఛన్నం చేసుకునేందుకు ప్రచారం సాగిస్తున్నారు.
మంథని,రామగిరి ఓట్లే అధికం..
మంథని నియోజకవర్గంలో మొత్తం 2,36,442 మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో మంథని మండలంలో  47,824 ఓటర్లు ఉండగా, రామగిరిలో 36,783, కమాన్ పూర్ లో 19,760  మంథని ముత్తారంలో 21,893, పాలకుర్తిలో 8,024, కాటారంలో 29,624, మహాదేవ్ పూర్ లో 24,589, మల్హర్ లో 21,893, మహాముత్తారం లో 20,184, పలిమేలలో 5,373  ఓటర్లు ఉన్నారు.2023 ఎన్నికల నాటికి 23,591 వేల మంది కొత్త ఓటర్లు,19మంది ఇతరులు ఉన్నారు.