మానుకోట సభను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – రాయపర్తి
ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న చలో మానుకోట సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎనగందుల శ్యామ్ సుందర్ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ మందాటి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలాలు తోనే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది అన్నారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న చలో మానుకోట సభకు మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల జిల్లా ఉపాధ్యక్షులు సుదగాని వెంకటేశ్వర్లు, హపావత్ పంతులు నాయక్, ప్రధాన కార్యదర్శి నాగండ్ల  భాస్కర్, సహాయ కార్యదర్శి తేజావత్ సంతోష్ నాయక్, మండల కమిటీ సభ్యులు వలబోజు హరిప్రసాద్,మునావత్ సేవిలాల్  లక్ష్మణ్, పోగులకొండ రాజమల్లు, దురిశెట్టి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.