శాంతిభద్రతల దృష్ట్యా పలువురి అరెస్టు విడుదల

నవతెలంగాణ -గోవిందరావుపేట
శాంతిభద్రతల సమస్య దృష్ట్యా మరియు మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి సంఘటన తలెత్తకుండా సిపిఐఎం, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్  ల నుండి పలువురిని అదుపులోకి తీసుకొని విడుదల చేసినట్లు పసర ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. శనివారం పసర పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ కరుణాకర్ రావు కథనం ప్రకారం వరంగల్ మోడీ పర్యటన ను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్న క్రమంలో మరియు శాంతిభద్రతలకు ఇలాంటివి కాదు కలగకుండా ముందస్తు చర్యలో భాగంగా సిపిఎం పార్టీకి చెందిన తుమ్మల వెంకటరెడ్డి గుండు రామస్వామి గొంది రాజేష్ కడారి నాగరాజు క్యాతం సూర్య నారాయణ బచ్చు సంజీవ ఎమ్మార్పీఎస్ నుండి ఇరుగు పైడి మడిపల్లి శ్యాంబాబు పేరాల బలరాం తోకల రాంబాబు కాంగ్రెస్ పార్టీ నుండి కే శ్రీనివాసరెడ్డి పాలడుగు వెంకటకృష్ణ రసపుత్ సీతారాం నాయక్ పన్నాల ఎల్లారెడ్డి జంపాల ప్రభాకర్ దాసరి సుధాకర్ తేల్ల హరిప్రసాద్ లను ఉదయం అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేసినట్లు తెలిపారు.