నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగా ది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యే ఎం.రవికుమార్ యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి సతీమణి టీటీడీ బోర్డ్ మెంబర్ సీతా రంజిత్‌రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లా డుతూ..శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతో షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, రవీంద్రప్రసాద్ దుబే, మంత్రి ప్రగఢ సత్యనారాయణ, రాజు ముది రాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.