కాంగ్రెస్‌లో పలువురు చేరిక

నవతెలంగాణ-జన్నారం
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన బీజేపీ ఇన్‌చార్జి సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కళ్లెం తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్‌కు చెందిన లోతొర్రే మాజీ సర్పంచ్‌ నర్సింగరావు, టీజీపల్లె గ్రామానికి చెందిన వెంకన్న ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన కూచాడి కమలాకర్‌రావు, బంజారా సంఘం మండల అధ్యక్షుడు అజ్మీర భీమ్లా నాయక్‌ వారి అనుచరులు సుమారు 50 మందితో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, ప్రజలకు తెలపాలన్నారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్‌ అలీ ఖాన్‌, మేకల మాణిక్యం, నాయకులు మిక్కిలినేని రాజశేఖర్‌, సయ్యద్‌ ఇసాక్‌, మచ్చ శంకరయ్య, గుర్రం మోహన్‌ రెడ్డి, ముత్యం రాజన్న, సయ్యద్‌ పసివుల్లా, మామిడిపల్లి ఇందయ్య, దూమల్ల రమేష్‌, టేకుమట్ల పంకజ, మున్ను, పాదం రాకేష్‌, గొర్రె మహేష్‌ యాదవ్‌, షాకీర్‌ అలీ, రాహుల్‌ యాదవ్‌, అబ్దుల్‌ ముజ్జు, ననేశ్వర్‌ పాల్గొన్నారు.