బిజెపికి చెందిన చంద్రశేఖర్ తో పలువురు కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ పరిధిలోని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్ ఆదివారం  నిజామాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పరిధిలోని దుబ్బ, మిర్చి కాంపౌండ్, వినాయక్ నగర్, నాందేవ్ వాడ, ప్రాంతాలకు చెందిన తన స్నేహ బృందంతో వచ్చి గత నాలుగేళ్లుగా బీజేపీ పార్టీలో ఉంటూ క్రియాశీలకంగా పనిచేశాను కానీ ఆ పార్టీ అజెండా మరియు పాలన చెప్పుకోదగ్గ లేదు, అంతే కాకుండా ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పట్ల వ్యవహరించిన తీరును చూసి చాలా బాధేసింది, మరియు సామాన్య ప్రజలకు ఎటువంటి లాభసాటి పథకాలను అమలు చెయ్యలేక విఫలమయ్యింది రైతులను కూడా దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం కనుకనే నేను ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు , ప్రియాంక గాంధీ  తెలంగాణా రైతుల కొరకై, యువత కొరకై ఫార్మర్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ను ప్రవేష పెట్టారు  అదేవిదంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విజయాన్ని సాధించింది కనుకనే నేను మరియు నా తోటి నాయకులు మరియు నా స్నేహ బృందంతో యువతతో కలసి 25మందికి పైగా నిజామాబాద్ లో ధర్మపురి సంజయ్ నాయకత్వంలో పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అజెండాకు మరియు రాహుల్ గారి నాయకత్వాన్ని బలపరచటానికై యువత  నాయకులు, ఉద్యోగులు ,రైతులు ఇలా ప్రతీ ఒక్కరూ కూడా బీజేపీ  బిఆర్ఎస్ పార్టీలను భూస్థాపితం చేసి ఆ ప్రభుత్వాలను ప్రజలే గద్దె దించే రోజులు మరింత దగ్గరపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం కోసం కార్యకర్తలు, యువత మరింత ఉత్సాహంగా ఉన్నారు మరియు నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచి గెలుపుదిశగా అడుగులువేస్తానని చెప్పారు.