ఎస్సై ని కలిసిన పలువురు నాయకులు 

Many leaders met SSIనవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర నూతన ఎస్సై గా జి. ఉపేందర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. గురువారం బీఆర్ఎస్, కాంగ్రెస్ మండల నాయకులు ఎస్సై ని కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు సమన్వయం అందిస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ, శాంతి భద్రతల పరిరక్షించడానికి కృషి చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎస్సై ని కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు సంకేపల్లి రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, బోనగిరి లింగమూర్తి, చిలుక సంపత్, వెంకన్న, చంద్రమౌళి, చింతల భాస్కర్, భద్రయ్య, శ్రీరాం రాము, చిలుక బిక్షపతి, చిలుక వెంకటయ్య తదితరులు ఉన్నారు.