
ప్రజాఏక్తా పార్టీ లోకీ పలువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్. గౌలిగూడ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎల్బీనగర్ కు చెందిన వి.మణికంఠ, రమేశ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. యువత. మహిళలు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్. ముఖేశ్ మేరకు, ఎం.నరేశ్ గౌడ్, ఎం.శ్రావణ్ కుమార్ గుప్తా, పి.శ్రీకాంత్, ఎస్.శివప్రసాద్ పాల్గొన్నారు.