మంత్రి వేములను పరామర్శించిన పలువురు ఎమ్మేల్యేలు, ప్రముఖులు

నవతెలంగాణ కమ్మర్ పల్లి:
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పరామర్శించారు. మంత్రి మాతృమూర్తి మంజులమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం వేల్పూర్ లోని మంత్రి నివాసంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, టూరిజం ఎం.డి మనోహర్, వరంగల్ ఎలెక్ట్రిసిటి డైరెక్టర్ మోహన్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.మంత్రి,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి వేముల తండ్రి దివంగత రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు, ప్రముఖులు  గుర్తు చేసుకున్నారు.