నవతెలంగాణ-వీణవంక
ఇటీవల జరిగిన బదిలీలల్లో భాగంగా వీణవంకకు నూతనంగా వచ్చిన ఎస్సై ఆసీఫ్ ను ఎమ్మార్పీఎస్ నాయకులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తాండ్ర శంకర్, పులి ప్రకాష్, సంపత్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, చల్లూరు మాజీ సర్పంచ్ జక్కుల నారాయణ గౌడ్, కండె మహేందర్ తదితరులు పాల్గొన్నారు.