నవతెలంగాణ – కంటేశ్వర్
దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. నేటి నుండి అనగా ఈనెల ఏడవ తేదీ నుండి ఈ నెల 13,14 వరకు సాంకేతిక కారణాలతో, ఆపరేషన్ వర్క్స్ కారణాలతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది అని నిజామాబాద్ ఆర్ పి ఎఫ్ సి ఐ వివి సుబ్బారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. కావున నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనించగలరని కోరుతున్నామన్నారు. రద్దెన రైళ్లలో కాచిగూడ-నిజామాబాద్(07596) ప్యాసింజర్ రైలు, నిజామాబాద్-కాచిగూడ (07593) ప్యాసింజర్ రైలు,నాందేడ్-నిజామాబాద్ (07854), ప్యాసింజర్ రైలు,నిజామాబాద్-నాందేడ్ (07853) ప్యాసింజర్ రైళ్లను, రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించారని నిజామాబాద్ ఆర్పిఎఫ్ సిఐ వివి సుబ్బారెడ్డి తెలిపారు. దాంతోపాటు ముత్కేడ్ నుండి నిజామాబాద్ కు వచ్చే ట్రైన్ 11409, నిజాంబాద్ నుండి కు 01413 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగిందని నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గమనించగలరని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐ వివి సుబ్బారెడ్డి తెలియజేశారు. ప్రజలు ముందే ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాల ద్వారా వెళ్లేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.