నవతెలంగాణ-ఓయూ
జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రొ.ఆదినారాయణ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్ తార్నాక కిమితి కాలనీలో ఆదినారాయణ నివాసంలో ఆయన మృతదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ సెక్రటరీ ఎం.శ్రీనివాస్ నివాళ్లర్పించారు. నిమ్స్ మాజీ డెరైక్టర్ డా.ప్రసాద రావు, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కోయ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ట్రెజరర్ రావుల వరప్రసాద్, రాష్ట్ర నేత బి.జగన్మోహన్‌రావు, చెకుముఖి కన్వీనర్ రాజా, జేవీవీ హైదరాబాద్ సిటీ కమిటీ జనరల్ సెక్రటరీ ఎస్‌పి.లింగస్వామి కూడా నివాళులర్పించారు.