ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా భూక్య మాన్య నాయక్ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా సీపీఓగా విధులు నిర్వర్తిస్తూ బదిలీలలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా నల్లగొండకు వచ్చారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఓగా 2021 నుండి 23 వరకు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుండి మార్చి 17 వరకు నల్లగొండ సీపీఓగా బాధ్యతలు నిర్వర్తించి యాదాద్రి భువనగిరి సీపీఓ గా వెళ్లి తిరిగి నల్లగొండ కు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వచ్చారు. కాగా మాన్యా నాయక్ సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన వ్యక్తి.