– ప్రకటించిన పార్టీ అధికార ప్రతినిధి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణించినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంత కాలంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సుదర్శన్.. మార్చి 31వ తేదీన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ విద్యార్థి దశ నుంచే రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాల పట్ల ఆకర్శితులై అందులో చేరారు. 1980లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో దళ సభ్యుడిగా చేరిన సుదర్శన్ అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండ కారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టారు.