మావోయిస్టు ల ఇలాకాలో వైద్యశిబిరం..

– అనారోగ్యం పై దృష్టి పెట్టండి ములుగు ఎస్పి గౌస్ ఆలం
– ఆలుబాక వైద్యశిబిరం లో 1600 మందికి వైద్యపరీక్షలు
– నవతెలంగాణ – వెంకటాపురం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంఆలుబాక హైస్కూలు సమీపంలో ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హాప్ అనే సచ్చంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్యశిబిరం ములుగు ఎస్పి గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. మారుమూల ఏజన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యం తో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఏజన్సీ గిరిజన ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.అనారోగ్యం సమస్య వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించాలన్నారు.అప్పుడే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం పొందినట్ల ఐతే ఆదిలోనే ఆరోగ్యం మెరుగు పడుతుంది అన్నారు.తద్వారా ఆరోగ్యం క్షినిచకుండా ఉంటుంది అని తెలిపారు. ఏజన్సీ ఆదివాసీల ఆరోగ్యం కోసం ఈ వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్యశిబిరంలో బీపీ,షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వృద్దులకు కంటి పరీక్షలు ,ఏక్స్ రే, గుండె సంబంధిత వ్యాధుల నిర్దారణ కొరకు ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.పట్టణాల్లో వేల రూపాయలతో ప్రయివేట్ వైద్య శాల్లో నిర్వహించే ఈ వైద్య పరీక్షలు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా చేస్తున్నారు అన్నారు.ఈ పరీక్షలను అందరూ ఉపయోగించు కోవాలని సూచించారు.
1600 మందికి వైద్య పరీక్షలు
మండల పరిధిలోని అలుబాకలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదీలక్ష్మి ,జడ్పీటీసీ పాయం రమణ తో కలసి ములుగు జిల్లా ఎస్పి గౌస్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఆలుబాక సమీపంలోని గిరిజన గ్రామాలకు చెందిన 1600 మంది కి రోగుల కు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అంద జేశారు.
గిరిజనుల మనుసు దోచుకున్న ఎస్పి
వైద్య శిబిరం లో వైద్య పరీక్షల కొరకు వచ్చిన వారికోసం భోజన వసతి కల్పించారు. ఏజన్సీ ఆదివాసీ గిరిజనులతో కలిసి వారితో  భోజనం చేసి ఏజన్సీ గిరిజన మనుసు దోచుకున్నారు.
యువత చెడుమార్గం లో వెళ్ళకండి
ములుగు ఏజన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ని వెంకటాపురం సర్కిల్ పరిధిలో మావోయిస్టు కార్యక్రమాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారని ములుగు ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.వైద్యశిబిరం ఆవరణలో వేలేఖరు లతో మాట్లాడారు.ఏ జన్సీలో మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు.అయినప్పటికీ మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అమాయక యువతను ప్రలోభాలకు గురిచేడ్తున్నారని అన్నారు.ఇటీవల మండలంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండలంలో యువత మావోయిస్టు పట్ల ఆకర్షితులు కావద్దని ,అసంగీక కార్యక్రమంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు పోలీస్ శాఖ తీసు కుంటుందని హెచ్చరించారు. ఈ వైద్యశిబిరంలో డాక్టర్ జవహర్ కెన్నేడీ, డి ఎస్ పి డి సి ఆర్ బి సుభాష్ బాబు,  సీఆర్పీఎఫ్ఏ 58 కమాండంట్ ధనసే లక్ష్మ ,సి ఐ ఏటూరునాగారం రాజు, వెంకటాపురం సిఐ కాగితోజు శివప్రసాద్, వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు ఎస్సై లు కొప్పుల తిరుపతి రావు, సురేష్, అశోక్, హరీష్, వైద్యాధికారి భవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.